శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘అనంత’ రైతులను ఆదుకోండి

12 గంటల క్రితం

‘అనంత’ రైతులను ఆదుకోండి
సిపిఎం జీపుజాతా ప్రారంభంలో గేయానంద image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 08:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ ‌గేయానంద్‌ ‌డిమాండ్‌

​ప్రజాశక్తి - అనంతపురం కలెక్టరేట్ : ఎల్‌‌నినో ప్రభావంతో రైతులు తీవ్ర కరువులో ఉన్నారని, ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకునే చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ ‌గేయానంద్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. అనంతపురం జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో జీపుజాతా కార్యక్రమాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. అనంతపురం నుంచి ఒకటి, రాప్తాడు మండల కేంద్రం నుంచి మరో జాతా ప్రారంభమైంది. అనంతపురం టవర్‌‌క్లాక్‌ ‌వద్ద జాతాను గేయానంద్‌, సామజిక వేత్త బోస్ జెండా ఊపి ప్రారంభించారు. సిపిఎం నగర కార్యదర్శి రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గేయానంద్, బోస్‌లు మాట్లాడుతూ జిల్లాలో తీవ్రంగా నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతాంగ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ముందుకు రావాలని, రైతుల రుణాలన్నింటినీ మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, జిల్లాకార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.నాగేంద్రకుమార్, ఎం.బాలరంగయ్య, ఆర్‌.చంద్రశేఖర్ రెడ్డి, ఎం.కృష్ణమూర్తి, రైతులు పాల్గొన్నారు.

​

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్