mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వడదెబ్బకు ఇద్దరు ఉపాధి కార్మికులు మృతి

29 మే, 2026

summer
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 29, 2026, 11:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - కర్నూలు హాస్పిటల్: సోంపేట వడదెబ్బకు వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం ఇద్దరు ఉపాధి కార్మికులు మృతిచెందారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఎర్రకత్వ గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లిన కార్మికుడు మాసపోగు హరిరాముడు (37) పని ప్రదేశంలోనే ఎండ వేడిమికి కుప్పకూలి పడిపోయారు. తోటివారు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. హరిరాముడు భౌతిక కాయాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్ దేశాయ్ సందర్శించారు. మృతుని కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని భూషాభద్ర గ్రామానికి చెందిన పల్లి మహాలక్ష్మి (45) ఉపాధి పనులకు గ్రామస్తులతో కలిసి వెళ్లారు. పనిచేస్తుండగా ఎండ తీవ్రతకు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు. తోటి కార్మికులు సపర్యలు చేసినా అప్పటికే ఆమె మృతి చెందారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్