ప్రజాశక్తి.. విజయనగరం టౌన్ : పారా రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీల కొరకు జిల్లా స్థాయి ఎంపికలు మంగళవారం నాడు డి. ఎస్. ఎ. స్విమ్మింగ్ పూల్ వద్ద నిర్వహించారు. ఎంపికలకు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుండి 18మంది వరకు హాజరయ్యారని జిల్లా అధ్యక్షులు కె దయానంద్ తెలిపారు. ఒక్కో కేటగిరికి ఒక్కొక్కరే హాజరు కావడంతో 11 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. వీరంతా అక్టోబర్ 5 న విజయవాడ లోని సర్ విజ్జి స్విమ్మింగ్ పూల్ లో జరుగబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 8 వ పారా స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్-2026 లో పాల్గొంటారని తెలిపారు. అంతర్జాతీయ క్రీడాకారుడు కొత్తింటి పైడిరాము, అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు పి. కళ్యాణి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
పారా స్విమ్మింగ్ రాష్ట్ర స్థాయి పోటీలకు 11 మంది ఎంపిక
13 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 03:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)