మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసిఇసి జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని పిటిషన్‌

1 గంట క్రితం

CEC Gyanesh Kumar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 02:29 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వచ్చేవారం విచారించనున్న సుప్రీం

న్యూఢిల్లీ : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్‌‌ను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు మంగళవారం అనుమతించింది. వచ్చే వారం ఈ పిటిషన్‌‌ను విచారించనుంది. రాకేష్ కుమార్ సింగ్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌‌ను న్యాయవాదులు వికాస్ సింగ్, సుదీప్ చంద్ర, ముదిత్ గుప్తాలు మంగళవారం ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) సూర్యకాంత్ ముందుకు తీసుకొచ్చారు. సిఇసి జ్ఞానేష్ కుమార్‌ ఏకపక్షంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఏకగ్రీవ నిర్ణయాల ద్వారానే భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) తన కార్యకలాపాలను నిర్వహించే విధంగా చూడాలని కోరారు. “రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(1) ఎన్నికల నిర్వహణ అధికారాన్ని ఎన్నికల సంఘానికి అప్పగించింది. ఏ ఒక్క వ్యక్తికీ కాదు. నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్నికల కమిషనర్లకు తప్పనిసరిగా భాగస్వామ్యం ఉండాలి. ప్రధాన ఎన్నికల కమిషనర్ మాటే అంతిమమని భావిస్తే, ఎన్నికల కమిషనర్లు నిష్ప్రయోజకులుగా లేదా కేవలం అలంకారప్రాయంగా మిగిలిపోతారు. కేవలం తన తొలగింపునకు ప్రత్యేక రక్షణ ఉన్నంత మాత్రాన ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర ఎన్నికల కమిషనర్ల కంటే ఉన్నత హోదాను అనుభవించరు” అని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును పిటిషన్‌‌లో గుర్తు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ సిఫార్సు మేరకే జరగాలని కూడా పిటిషన్‌లో తెలిపారు. అలాగే, 'ఫారం-6'లో ఇకపై ఎలాంటి మార్పులు చేయకూడదని, ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవాలనుకునే అర్హులైన పౌరులను నిరాకరించడం లేదా అడ్డుకోవడం చేయకూడదని ఆ పిటిషన్ పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్