ప్రజాశక్తి - ముంచింగిపుట్టు (అల్లూరి జిల్లా) : అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని మారుమూల ప్రాంతం, ఒడిశా సమీప బూసిపుట్టు నుంచి వాహనంలో తరలిస్తున్న 1,200 కిలోల గంజాయిని పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి జైపూర్‌కు తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. విశాఖపట్నం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఇన్‌స్పెక్టర్ కె.కిరణ్ బాబు కథనం మేరకు.. ముంచంగిపుట్టు మండలానికి చెందిన వంతల గోపాల్, కిల్లో అనంతరామ్, ఒడిశా రాష్ట్రంలోని గోవిందుపల్లికి చెందిన కర్ర పురుషోత్తం ఈ గంజాయి తరలింపులో కీలకంగా ఉన్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.5 కోట్ల పైచిలుకు విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
1,200 కిలోల గంజాయి పట్టివేత
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 21, 2026, 11:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)