బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

తోటి విద్యార్థినులకు మూత్రం కలిపిన నీళ్లు

1 గంట క్రితం

mp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 08:54 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- చాక్లెట్ తినమన్న ప్రిన్సిపాల్

- మధ్యప్రదేశ్‌లో పాఠశాలలో దారుణం

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో దారుణమైన ఘటన జరిగింది. ఓ విద్యార్థి తన తోటి విద్యార్థినులకు మూత్రం కలిపిన నీటిని తాగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని విద్యార్థినులు పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయగా.. ఆయన స్పందనపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. విద్యార్థినుల చెప్పిన వివరాల ప్రకారం.. సదరు విద్యార్థి తన వాటర్ బాటిల్‌లో మూత్రం కలిపి, దానిని తోటి విద్యార్థినులకు తాగించాడు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్‌కు చెప్పినప్పటికీ.. ఆయన సానుభూతితో స్పందించకుండా, నోరు రుచిగా లేకపోతే రూ.10 విలువైన చాక్లెట్ తినాలని సూచించినట్లు బాలికలు ఆరోపించారు.

తల్లిదండ్రుల నిరసన

ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రిన్సిపాల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసి, పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నివేదిక ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్