మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

బిజెపి హయాంలో 152 పేపర్‌ లీకేజీలు

1 రోజు క్రితం

paper
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 20, 2026, 01:43 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- జేడీ శీలం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 152 పేపర్ లీక్ ఘటనలు చోటుచేసుకుని 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలపై ప్రభావం చూపాయని ఎపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ శీలం ఆరోపించారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు కాంగ్రెస్‌ ఆధ్వర్యాన ‘ఛాత్రోన్ కీ గూంజ్’ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. పేపర్ లీకేజీలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు జరపాలని, పేపర్ లీక్ నిరోధక కఠినమైన నిభందనలతో చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థులకు రూ.10 వేల పరిహారం అందించాలని, అదనపు రుసుము లేకుండా ఉచితంగా మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కోరారు. పేపర్ లీకేజీలు, ఉద్యోగాల కొరతతో యువతపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని, జాతీయ పరీక్షల సంస్థలో సమూల మార్పులు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ నేత కొలనుకొండ శివాజీ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్