ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్ సంస్థల్లో విడుదల చేసిన 629 అసిస్టెంట్ ఎగ్జీక్యూటీవ్ ఇంజనీర్(ఎఇఇ) పోస్టులకు ఆదివారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 1,05,566 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్న ఈ పరీక్షకు 94 పరీక్షా కేంద్రాలను విద్యుత్ సంస్థలు ఏర్పాటు చేశాయి. కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగే ఈ పరీక్షలు 27వ తేది వరకు రెండు పూటా జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పరీక్షకు ఉదయం 7.30 గంటల నుంచి, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరిగే పరీక్షకు మధ్యాహ్నం 1 గంట నుంచి అభ్యర్ధులను పరీక్షా కేంద్రాల్లో అనుమతి ఇస్తారు. ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంధన శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా ఈ పరీక్షలను నిర్వహిస్తుందని, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరైనా నిరుద్యోగుల్ని మోసాగించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా ప్రలోభ పెడుతుంటే అభ్యర్థులు కూడా నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు.
నేటి నుంచే ‘ఎఇఇ’ పరీక్షలు
22 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 23, 2026, 02:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)