శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎపి పోలీసులకు 23 కేంద్ర పతకాలు

14 ఆగస్టు, 2026

police
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 12:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఏడుగురికి శౌర్య పతకాలు.. ఇద్దరికి విశిష్ట సేవా పతకాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోలీస్‌, ఫైర్‌, హోంగార్డ్‌ ,సివిల్‌ డిఫెన్స్‌, కరెక్షనల్‌ సర్వీసెస్‌ పతకాల్లో ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ శాఖకు 23 పతకాలు దక్కాయి. వీటిలో ఏడుగురికి శౌర్య పతకాలు (జిఎం), ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు (పిఎస్‌ఎం), 14 మందికి ప్రశంసనీయ సేవా పతకాలు (ఎంఎస్‌ఎం) లభించాయి.శుక్రవారం కేంద్ర హోంశాఖ స్వాతంత్ర్య దినోత్సవం2026 సందర్భంగా పతకాల గ్రహీతల రాష్ట్రాల వారీ జాబితాను విడుదల చేసింది. విధి నిర్వహణలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన పోలీసు అధికారులు, సిబ్బందికి శౌర్య పతకాలను ప్రకటించారు. సుదీర్ఘకాలం విశిష్ట సేవలు అందించిన వారికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, మెరుగైన సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రశంసనీయ సేవా పతకాలను అందజేయనున్నారు. ఎపి పోలీస్‌ శాఖకు లభించిన 23 పతకాల్లో శౌర్య పతకాలు ఏడు ఉండడం విశేషం. ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించిన సిబ్బంది ధైర్యసాహసాలకు ఈ పతకాలు గుర్తింపుగా నిలుస్తాయి. మరోవైపు ఇద్దరు అధికారులు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలకు, 14 మంది ప్రశంసనీయ సేవా పతకాలకు ఎంపికయ్యారు. ఆగస్టు 15న చంద్రబాబు చేతుల మీదుగా పతకాలను ప్రధానం చేయనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్