గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకంపెనీలకు 3వేల ఎకరాలు

1 గంట క్రితం

cbn.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 11:22 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • విజయనగరంలో స్టీల్‌ ఎక్స్ఛేంజ్‌ కంపెనీ

  • పలు కంపెనీలకు ప్రోత్సాహకాలు

  • ఆమోదించిన మంత్రివర్గం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పలు కంపెనీలకు భూములు అప్పగించేందుకు రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం హైబ్రిడ్‌ ‌విధానంలో గురువారం జరిగింది. ఈ సమావేశంలో పలు కంపెనీలకు భూములు కేటాయింపులకు సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదం తెలిపినట్లు సమాచారం. వైఎస్‌ఆర్‌ ‌కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్‌ ఉప్పలపాడులో శ్రీసిమెంట్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీకి 452 ఎకరాలు అప్పగించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కర్నూలు ఓర్వకల్‌ ఐపి గుట్టపాడులో జైరాజ్‌ ఇస్పాట్‌‌కు 418.55 ఎకరాలు, నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో అల్లంపాడులో సన్‌‌షైన్‌ ఎనర్జీటిక్‌ ‌కంపెనీకి 455.91 ఎకరాలు, అదే జిల్లాలో మునిష్‌ ‌డిఫెన్స్‌ ‌సొల్యూషన్స్‌ ‌లిమిటేడ్‌‌కు ఎగర్జీటిక్‌ ‌మెటిరీయల్స్‌, కమర్షియల్‌ ఎక్స్‌‌ప్లొజివ్‌ ‌ప్లాంట్‌‌ కోసం 250 ఎకరాలు, ఆదిత్య ప్రిసిటెక్‌ ‌లిమిటేడ్‌‌కు 300 ఎకరాలు, కర్నూల్‌‌లో ఓర్వకల్‌‌లో జాక్సన్‌ ‌సోలార్‌ ఇంటిగ్రేటేడ్‌ ‌కంపెనీకి 290 ఎకరాలు చొప్పున కేటాయింపులు చేసింది. ఎన్టీఆర్‌ ‌జిల్లా జగ్గయ్యపేట వేద్రాదిలో 713.04 ఎకరాలను డిఫెన్స్‌ ‌క్లస్టర్‌ ఇండస్ర్టీయల్‌ ‌పార్క్‌‌ కోసం అప్పగించనుంది. వీటితో పాటు ఎంఎస్‌ఎంఇ, ఇండస్ర్టీయల్‌ ‌పార్కుల కోసం చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూల్‌, కడప జిల్లాల్లో సుమారు 600 ఎకరాలు కేటాయించేలా వచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. విశాఖపట్నం నగరపాలక సంస్థకు చెందిన 5.84ఎకరాల భూమిని వైజాగ్‌ ‌హైపర్‌‌స్కేల్‌ ‌డేటా సెంటర్‌ ‌పార్క్‌ ‌లిమిటేడ్‌(అదానీ ఇన్‌‌ఫ్రా ఎస్‌‌పివి)కి ప్రత్యేక కేసుగా లీజుకు ఇచ్చింది. వీటితో పాటు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపిబి)లో ఆమోదించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కర్నూల్‌ ఓర్వకల్‌‌లో రిలయన్స్‌ ‌‌కన్స్యమర్‌ ‌ప్రొడక్స్‌ ‌కంపెనీకి పలు ప్రోత్సాకాలు కల్పించేందుకు అంగీకారం తెలిపింది. పల్నాడు జిల్లాలో అమరావతి రాజధాని సరిహద్దు వద్ద క్వాంటమ్‌ ‌హార్డ్‌‌వేర్‌ ‌మాన్‌‌ఫ్యాక్చరింగ్‌ ‌పార్క్‌ ‌కోసం 250 ఎకరాలు సేకరించేందుకు ఆమోదం తెలిపింది. విజయనగరం జిల్లా శ్రీరాంపురంలో స్టీల్‌ ఎక్స్ఛంజ్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రూ.5,194కోట్ల పెట్టుబడితో ఏడాదికి 10లక్షల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో ఏర్పాటయ్యే ఈ ప్లాంట్‌‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించనుంది. ఎపి ఇంటిగ్రేటెడ్‌ ‌క్లీన్‌ ఎనర్జీ పాలసీ-2024 సవరించింది. విజయవాడలోని ఎన్‌‌టిటిపిఎస్‌, కడపలోని ఎంవిఆర్‌ ఆర్‌‌టిపిపి విద్యుత్‌ ‌ప్లాంట్లకు 3లక్షల మెట్రిక్‌ ‌టన్నుల బొగ్గును ఏడాది పాటు అవసరమైన చోట కొనుగోలు చేసేందుకు ఆమోదం తెలిపింది. అదనపు వేరియబుల్‌ ‌ఖర్చులను డిస్కంలు చెల్లించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్