ఇండియా బ్లాక్ ఆధ్వర్యంలో ‘అభిశంసన’
ఎస్ఐఆర్తో ఓటు కోల్పోయిన ఓటర్లు, పౌర సమాజ ప్రతినిధుల ప్రసంగాలు
ఢిల్లీలో భారీగా బలగాల మోహరింపు
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ నేడు నిర్వహించనున్న ‘అభిశంసన’ కార్యక్రమం ప్రజా బహిరంగ విచారణగా జరగనుంది. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షత వహిస్తారు. జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానాన్ని ఖర్గే ప్రవేశపెడతారు. ఇండియా బ్లాక్‌లోని ప్రతి పార్టీ నుంచి ఒక్కో ప్రతినిధి చర్చలో పాల్గొంటారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) కారణంగా ఓటు హక్కు కోల్పోయిన ఓటర్లు, పౌర సమాజ ప్రతినిధులు తమ అభిప్రా యాలను వెల్లడిస్తారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముగింపు ప్రసంగం చేస్తారు. కార్యక్రమ నిర్వహణ విధివిధానాలను ఖరారు చేసేందుకు ఖర్గే నివాసంలో శుక్రవారం ఇండియా బ్లాక్ సమావేశం జరిగింది. ఇందులో సిపిఎం రాజ్యసభా పక్ష నేత జాన్ బ్రిట్టాస్ పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ విశ్వసనీ యత, పారదర్శకత, నిష్పాక్షికతను జ్ఞానేశ్ కుమార్ దెబ్బతీశారని, ఆయనపై జరిగే ప్రజా విచారణగా ఈ ప్రతీకాత్మక అభిశంసన నిలుస్తుందని బ్రిట్టాస్ పేర్కొ న్నారు. అయితే, ఈ కార్యక్రమాన్ని మొదట అశోకా హోటల్లో, ఆ తర్వాత నవంబర్ 1న భారీ నిరసన తలపెట్టిన రాంలీలా మైదానంలో నిర్వహించాలని ప్రతిపక్షాలు భావించాయి. రెండుచోట్లా అనుమతి నిరాకరించారని ప్రతిపక్షాలు తెలిపాయి. అనుమతి నిరాకరణ ప్రతిపక్షాల రాజకీయ సమీకరణను అడ్డుకు నేందుకేనని, వేదిక మార్పులు తమ ప్రచారానికి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందనే వాదనలో భాగమని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ‘‘ప్రతిపక్ష ఎంపీలు, పార్టీ నేతలు, పౌర సమాజ ప్రముఖులు, విద్యార్థి నేతలు, ఎస్ఐఆర్లో పేర్లు తొలగించిన కొందరు ఓటర్లు ఈ కార్యక్రమానికి హాజరవుతారు’’ అని ఒక సీనియర్ కాంగ్రెస్ నేతలు తెలిపారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) కారణంగా ఓటు హక్కు కోల్పోయామని చెబుతున్నవారు తమ అనుభవాలను వివరిస్తారు. వీరితో పాటు ప్రతిపక్ష ఎంపీలు, న్యాయనిపుణులు వాదనలు వినిపిస్తారు.
పోలీసు వలయంలో ఢిల్లీలో..
శుక్రవారం జరిగే ప్రతీకాత్మక అభిశంసన కార్యక్రమంతోపాటు ఆదివారం నిర్వహించనున్న మహా ర్యాలీ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టనుంది. సుమారు 3,500 మంది ఢిల్లీ పోలీసు సిబ్బందితోపాటు కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన పది కంపెనీలను మోహరించనున్నట్లు సమాచారం. ర్యాలీ జరిగే ప్రాంతాన్ని 14 జోన్లుగా విభజించి భద్రతా చర్యలు చేపడతారు. తనిఖీలకు సీసీ కెమెరాలతోపాటు వెయ్యిమంది పోలీసులు బాడీ కెమెరాలను వినియోగించనున్నారు.







కామెంట్లు (0)