గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తుఫాను బాధిత ప్రాంతాలలో ఎన్నికలను రీ షెడ్యూలు చేయాలి : ఎస్ఇసి కి వి.శ్రీనివాసరావు లేఖ

3 గంటల క్రితం

What is Said vs What is Done V Srinivasa Rao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 11:58 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : తుఫాను బాధిత ప్రాంతాల్లో జిల్లా, మండల ప్రాదేశిక ఎన్నికల రీ షెడ్యూలు చేయాలని కోరుతూ ... రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ‌కి సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు గురువారం లేఖ రాశారు. ఈ నెల 27, 28 తేదీలలో శ్రీకాకుళం మొదలుకొని ఎన్‌టిఆర్ జిల్లా వరకు అర్నబ్ తుఫానుకు అతలాకుతలమైందన్నారు. తక్షణం ప్రజలు కోలుకోలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. భారీ వర్షాల వల్ల వరదల ముంపు కూడా పొంచి ఉందని, కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కేంద్రీకరించి సహాయ కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఆ రీత్యా 5 వ తేదీన నిర్వహించే స్థానిక ఎన్నికల వల్ల అధికార యంత్రాంగం తుఫాను బాధితులకు సహాయం చేయడానికి ఆటంకమవుతుందని వివరించారు. మానవతా దృక్పథంతో ఈ ఎన్నికలను తుఫాను బాధిత ప్రాంతాలలో రీ షెడ్యూలు చేయాలని వి.శ్రీనివాసరావు కోరారు.
letter



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్