రాం లీలాకు తరలిరండి
ప్రజలకు రాహుల్ గాంధీ పిలుపు
న్యూఢిల్లీ : ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన కోసం ఇండియా ఫోరం నవంబరు 1వ తేదీన చేపడతున్న ‘చలో ఢిల్లీ’ కార్యాక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పోలీసులకు, వారి లాఠీలకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు గురువారం నాడు సామాజిక మాధ్యమాల్లో ఆయన పోస్టు చేశారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవటానికి, దేశాన్ని కాపాడుకోవడానికి కలిసికట్టుగా నడుద్దామని పిలుపునిచ్చారు. ‘చలో ఢిల్లీ ..ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, ఓటు చోరీని అరికట్టడానికి, రాజ్యాంగాన్ని రక్షించడానికి చేపట్టిన పాదయాత్ర. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీది కాదు, ఇది భారతదేశ ఆత్మ పాదయాత్ర. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమంత్రి అమిత్ షా, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సిఇసి) జ్ఞానేష్ కుమార్‌తో విసిగిపోయిన ప్రజలందరూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకునేవారు, రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుకునే వారందరూ రావాలి. పోలీసులు, లాఠీల గురించి భయపడకండి. కుతంత్రాలను ప్రయోగించే దమ్ము బిజెపికి లేదు. ఇది దేశం కోసం జరుగుతున్న యాత్ర, ఇది మీ యాత్ర. మీరందరూ రండి మనమందరం కలిసి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం’ అని రాహుల్ పిలుపునిచ్చారు.








కామెంట్‌లు (0)