సోమవారం, 20 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

జిఎస్టి అప్పీళ్ల ట్రైబునల్‌ కార్యాలయాలకు 34 పోస్టులు

16 గంటల క్రితం

gst
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 08:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వస్తు సేవల పన్ను అప్పీళ్ల ట్రైబ్యునల్‌ పరిధిలోని విజయవాడ, విశాఖపట్నం కార్యాలయాలకు 34 పోస్టులను పునఃకేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరిలోని ‌జిఎస్టిఎటి రాష్ట్ర బెంచ్‌ పరిధిలోని అధీకృత ప్రతినిధి కార్యాలయానికి 17 పోస్టులు, విశాఖపట్నం సిట్టింగ్‌ బెంచ్‌ కార్యాలయానికి మరో 17 పోస్టులు కేటాయించారు. ఒక్కో కార్యాలయానికి 5 జిఎస్టిఒలు పోస్టులు, 4 సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 4 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 4 కార్యాలయ సహాయకుల పోస్టులు కేటాయించారు. ఇప్పటికే జిఎస్టిఎటి బెంచ్‌లు, అధీకృత ప్రతినిధి కార్యాలయాల కోసం మంజూరైన 141 పోస్టుల్లో నుంచి ఈ 34 పోస్టులను పునఃకేటాయించారు. కొత్తగా కేటాయించిన పోస్టులకు సంబంధించిన స్థానాలను మ్యాపింగ్‌ చేసి, ఈ-హెచ్‌ఆర్‌ఎం పోర్టల్‌ నిర్మాణాలను నవీకరించేందుకు రాష్ట్ర పన్నుల శాఖ ముఖ్య కమిషనర్‌, ఖజానా ఖాతాల శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్