సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘భక్తి’ కాలుష్యం

1 గంట క్రితం

temple
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 02:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

విలువ వేలల్లో

గుళ్లలోని విగ్రహాలెన్నో అపహరణం.

విలువ లక్షల్లో

దేవాలయాల భూములెన్నో ఆక్రమణం.

విలువ కోట్లల్లో

విరాళాల బహుమతుల కానుకలెన్నో

చెరపట్టిన గ్రహణం

ఆధ్యాత్మిక ముసుగులో దారుణం.

నేరం రుజువై

అపహరించిన, ఆక్రమించినవాళ్లు కటకటాలు

పైకి అగ్రేసురులుగా, లోపల బకాసురులుగా

చెలామణి అవుతున్నవాళ్లు కాలుమీద కాలు

వివరాలు ఇవ్వక, రసీదులు చూపక

లెక్కలు చెప్పక

సంఘంలో గౌరవాలు, మర్యాదలు, విలువలు.

దాతలు ప్రేమలో నడిస్తే, సేవలో తరిస్తే

నేతలు భక్తుల మనోభావాలు కాలరాస్తే!​


- కోటం చంద్రశేఖర్,

సెల్‌: 9492043348

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్