సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పెద్దలకు మాఫీ.. సామాన్యులకు జరిమానా!

1 గంట క్రితం

money
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 11, 2026, 02:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

పొదుపు, కరెంట్ ఖాతాలలో సగటు కనీస డిపాజిట్ (ఎ.ఎం.బి) నిర్వహించనందుకు గాను, వినియోగదారుల నుండి బ్యాంకులు జరిమానాల రూపంలో వసూలు చేసే మొత్తం ఏటా పెరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు వినియోగదారుల నుండి రూ. 27,087 కోట్లు వసూలు చేశాయి. ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే, ప్రైవేట్ బ్యాంకులు ఎక్కువ జరిమానాలు వసూలు చేస్తున్నాయి. ఇది చాలా మంది వినియోగదారులపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో జరిమానాలు విధించడం అంటే పుండుపై కారం చల్లడం లాంటిది. అంతేకాకుండా, బ్యాంకులు నిర్దేశించిన కనీస డిపాజిట్ పరిమితులు వాస్తవికమైనవేనా? ఒకవైపు, బ్యాంకులు లక్షల కోట్ల రూపాయల రుణాలను వసూలు చేసుకోలేక మాఫీ చేస్తున్నాయి. మరోవైపు, అవి సాధారణ డిపాజిటర్లను నిర్దాక్షిణ్యంగా వేధిస్తున్నాయి. పెద్ద పెద్ద ఎగవేతదారుల విషయంలో కనిపిస్తున్న వెసులుబాటు చిన్న డిపాజిటర్ల విషయంలో ఎందుకు లేదు?


- దాసం వెంకటరెడ్డి,

ఊరదాళ్లపాలెం,

పశ్చిమ గోదావరి జిల్లా. ​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్