ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పరిశీలన అనంతరం మొత్తం 7,162 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. మొత్తం 7,516 నామినేషన్లు దాఖలు కాగా, వీటిలో 354 తిరస్కరణకు గురయ్యాయి. ఈ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో మేయర్, ఛైర్‌పర్సన్, వార్డు సభ్యుల స్థానాలకు ఈ నామినేషన్లు ఆమోదం పొందాయి. 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోని ఛైర్‌పర్సన్ స్థానాలకు 292 నామినేషన్లు దాఖలు కాగా, 19 తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 273 ఆమోదం పొందాయి. 750 వార్డు సభ్యుల స్థానాలకు 4,656 నామినేషన్లు దాఖలు కాగా, 115 తిరస్కరణకు గురయ్యాయి. 4,541 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. నాలుగు మేయర్ స్థానాలకు 91 నామినేషన్లు దాఖలు కాగా, ఏడింటిని తిరస్కరించారు. 260 కార్పొరేషన్ వార్డు సభ్యుల స్థానాలకు 2,477 నామినేషన్లు అందగా, 213 తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 2,264 ఆమోదం పొందాయి.
Print Edition7,162 నామినేషన్లు ఆమోదం
24 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 19, 2026, 12:08 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)