బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎఎస్‌డిడి ఓటర్ల నమోదుకు కొత్త షెడ్యూల్‌

17 నిమిషాల క్రితం

vivek-yadav.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 12:23 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) తుది జాబితా ప్రచురణ తేదీని భారత ఎన్నికల సంఘం మార్పు చేసింది. ఈ నెల 30న ప్రకటించాల్సిన తుది ఓటర్ల జాబితాను డిసెంబర్‌ 22న ప్రచురించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఎస్‌ఐఆర్‌ సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు పొందని( గైర్హాజరైన వారు, నివాసం మారిన వారు, మరణించిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదైన వారు) ఎఎస్‌డిడి ఓటర్ల నమోదుకు ప్రత్యేకంగా గడువు కల్పించారు. ఈ నెల 18 నుంచి 30వ తేదీ వరకు ఎన్యూమరేషన్‌ ఫారమ్‌ల పంపిణీ, సేకరణ ప్రక్రియ కొనసాగనుంది. డిసెంబర్‌ 10వ తేదీలోగా ఎన్యూమరేషన్‌ ఫారమ్‌ల పరిష్కారం పూర్తి చేయాల్సి ఉంటుంది. నోటీసుల దశతోపాటు క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారానికి గడువును డిసెంబర్‌ 15 వరకు పొడిగించారు. గతంలో ఈ ప్రక్రియను నవంబర్‌ 20వ తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించగా, తాజాగా మరో 25 రోజులు పొడిగించారు. తాజా మార్పులతో తుది జాబితా ప్రచురణ డిసెంబర్‌ 22కు వాయిదా పడింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్