శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జనారణ్యంలోకి పెద్దపులి

15 నవంబర్, 2026

జనారణ్యంలోకి పెద్దపులి
- ప్రధాన రహదారి మీదుగా సంచారంతో జనం ఆందోళన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 07:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రధాన రహదారి మీదుగా సంచారంతో జనం ఆందోళన

ప్రజాశక్తి - జీలుగుమిల్లి (ఏలూరు జిల్లా): రెండు రోజులుగా బొత్తప్పగూడెం అటవీ ప్రాంతంలో సేదదీరిన పెద్దపులి జీలుగుమిల్లి ప్రధాన రహదారి మీదుగా జనావాసాల్లోకి ప్రవేశించడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. శనివారం రాత్రి ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి మీదుగా సంచరిస్తూ కిరాణా దుకాణంలోని సిసి కెమెరాలకు చిక్కింది. దీంతో దుకాణదారులు, చుట్టుపక్కల ప్రజానీకం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అటవీ అధికారులు వెంటనే ఆ పులిని పట్టుకోవాలని వారు కోరుతున్నారు. జీలుగుమిల్లి గ్రామం మీదుగా సంచరిస్తూ చంద్రమ్మ కాలనీ సమీపంలోని అల్లిగూడెం వైపు పులి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పశువులను ఊరికి దూరంగా కట్టొద్దని సూచించారు. పులి కదలికలను రెస్క్యూ టీమ్ డాక్టర్ గణేష్, బృంద సభ్యులు లోకేష్, జంగారెడ్డిగూడెం అటవీ శాఖ రేంజ్ అధికారులు రాంబాబు, ఏసు పండు, మారేష్, బీట్ అధికారులు ప్రసన్న, బేస్ క్యాంప్ సిబ్బంది పాపారావు, రమేష్, ప్రభాకర్‌ గమనిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్