‘జెఎం భక్షి’ కన్వేయర్ బెల్టులో అగ్నిప్రమాదం
ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం) : విశాఖపట్నం పోర్టు ట్రస్టులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పోర్టులోని జెఎం భక్షి కంపెనీలో నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్టులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఏమి జరుగుతుందో తెలియక సమీప ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. పోర్టు అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ప్రమాదం వల్ల ఎంత నష్టం జరిగింది ? ప్రమాదానికి కారణాలు తెలియ రాలేదు. కన్వేయర్ బెల్ట్ వద్ద జరిగిన వెల్డింగ్ పనుల సమయంలో వెలువడిన నిప్పు రవ్వలే ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు.








కామెంట్‌లు (0)