- కార్మికునికి తీవ్ర గాయాలు
ప్రజాశక్తి - పరవాడ : అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని నొవోపూర్ ఫార్మా పరిశ్రమలో ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం బి-షిఫ్ట్ సమయంలో జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మునగపాక మండలం పాటిపల్లి గ్రామానికి చెందిన ఎల్లపు రాము.. హెల్పర్‌గా పనిచేస్తున్నారు. విధుల్లో ఉండగా రియాక్టర్ నుంచి సిఎస్‌పి పదార్థం మీద పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయన కంటికి, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి క్షతగ్రాతుడిని తరలించారు. ఘటనా స్థలాన్ని ఫార్మా సిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) గౌరవాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. కార్మికునికి తీవ్ర గాయాలైనప్పటికీ మెరుగైన వైద్య సేవలు అందించడంలో జాప్యం జరగడం ఆందోళనకరమన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా అధికారులకు సమాచారం అందించకుండా యాజమాన్యం గోప్యంగా వ్యవహరించడం దుర్మార్గమని విమర్శించారు.








కామెంట్‌లు (0)