సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

​ఉపాధ్యాయులపై దాడిచేసిన వారిపై చర్యలు

49 నిమిషాల క్రితం

nara
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 11:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- మంత్రి లోకేష్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయులపై రాడ్లు, కర్రలతో దాడి చేసిన క్రిమినల్ గ్యాంగులను వదిలే ప్రసక్తి లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ హెచ్చరించారు.గురువులను వైన్ షాపులకు కాపలా పెట్టిన జగన్ ఉపాధ్యాయులను గౌరవిస్తారు అనుకోవడం భ్రమ అని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడాకారులను స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు అంటూ తప్పుడు ఆరోపణలు చేసినప్పుడే జగన్ దుర్బుద్ధి బయటపడిందదని విమర్శించారు. తప్పుడు నిందలతో అవమానాలు పాలైన స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు తమకు న్యాయం చేయాలంటూ శాప్ కార్యాలయం వద్ద అధికారులను కలిశారని తెలిపారు. ​శాప్ కార్యాలయం వద్ద అల్లర్లకు పాల్పడిన వారిని ఎవరినీ వదిలిపెట్టబోమని హోంమంత్రి వంగలపూడి అనిత మరో ప్రకటనలో హెచ్చరించారు. శాప్ కార్యాలయం వద్దకు వచ్చినవారి వీడియోలన్నీ పరిశీలించామని, రౌడీషీటర్లు, వివిధ కేసుల్లో నిందితులు, అనుమానితులు ఉన్నారని తెలిపారు. లిక్కర్ స్కామ్‌ను పక్కదారి పట్టించేందుకే డిఎస్సిపై వైసిపి రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. వైసిపి ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణం బట్టబయలవుతుండటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైఎస్‌ ‌జగన్‌ డిఎస్సి అభ్యర్థులపై, నియామకాలపై బురదజల్లుతున్నారని టిడిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టిడిపి నేత, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ‌చైర్మన్‌ ‌కొమ్మారెట్టి పట్టాభిరామ్ ఆరోపించారు. అబద్ధాలు, అసత్యాలతో జగన్‌ ‌తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి కొలుసు పార్ధసారధి మరో ప్రకటనలో పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్