శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జితేంద్ర సింగ్‌కు సిజెపి నేత పరువునష్టం నోటీసు

13 నిమిషాల క్రితం

cjp.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 06:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ నుండి నిధులు పొందుతున్నారన్న వ్యాఖ్యలపై కేంద్ర సహాయమంత్రి జితేంద్రసింగ్‌కు సిజెపి కో-కన్వీనర్‌ అశుతోష్‌ రాంకా పరువునష్టం నోటీసులిచ్చారు. సిజెపి న్యాయబృందం శుక్రవారం ఈ నోటీసులు జారీ చేసింది. నవంబర్‌ 3న బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో సింగ్‌ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం, విద్వేషపూరితం, నిరాధారమైన ఆరోపణలుగా నోటీసు పేర్కొంది. జితేంద్రసింగ్‌ ‘అసహ్యకరమైన వ్యాఖ్య’లపై పరువునష్టం నోటీసులిచ్చినట్లు అశుతోష్‌ రాంకా ఎక్స్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఐఐటి కాన్పూర్‌, లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో అర్హత సాధించేందుకు కష్టపడి చదువుకున్నానని అన్నారు. మెకిన్సీలో అత్యధిక జీతంతో కూడిన ఉద్యోగాన్ని, లండన్‌లో సౌకర్యవంతమైన జీవితాన్ని వదులుకుని దేశానికి సేవ చేసేందుకు భారత్‌కు తిరిగి వచ్చానని అన్నారు. గత రెండేళ్లుగా దేశంలోని ప్రజలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తుతూ ప్రజా జీవితం గడుపుతున్నానని అన్నారు. మెకిన్సీ, జిఎవిఐ (గావి) , ఇతరసంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఉన్నాయని, అవి భారతదేశపు చట్టాలకు అనుగుణంగా ఉన్నాయని అన్నారు. ఈ సంస్థలతో భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయని, ఇందులో భాగంగానే గావికి 20 మిలియన్‌ డాలర్ల విరాళం కూడా అందిస్తున్నామని అన్నారు. జితేంద్ర సింగ్‌ వంటి వ్యక్తులు తన నిజాయితీని, దేశం పట్ల తనకున్న ప్రేమను ప్రశ్నించడాన్ని సహించనని, అందుకే ఆయనకు పరువునష్టం నోటీసులు పంపానని అన్నారు. మరో సిజెపి నేత సౌరవ్‌దాస్‌ గురువారం ఈ ఆరోపణలను ఖండించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్