శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బిఇడి కళాశాలల్లో నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు

13 నవంబర్, 2026

ap-high-court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 08:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- హైకోర్టు ఆదేశం

ప్రజాశక్తి-అమరావతి : అర్హత కలిగిన అధ్యాపకులు, కనీస మౌలిక సదుపాయాలు లేకుండా బిఇడి కళాశాలలను నిర్వహిస్తే ఉపేక్షించొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. రాయలసీమ, ఆంధ్ర కేసరి, యోగి వేమన విశ్వవిద్యాలయాల పరిధిలోని ప్రైవేటు బిఇడి కళాశాలల్లో నిబంధనల ఉల్లంఘనలపై తనిఖీలు నిర్వహించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌‌సిటిఇ) ఆదేశించింది. అయితే సంబంధిత కళాశాలలపై చర్యలు తీసుకునే ముందు వాటి యాజమాన్యాలకు తమ వాదనలు వినిపించుకునే అవకాశం కల్పించాలంది. అనంతరం తగిన నిర్ణయం తీసుకోవాలని చీఫ్ జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. యోగి వేమన, ఆంధ్ర కేసరి, రాయలసీమ విశ్వవిద్యాలయాల పరిధిలోని పలు ప్రైవేటు బిఇడి కళాశాలలు ఎన్‌‌సిటిఇ నిబంధనలకు విరుద్ధంగా అర్హత కలిగిన బోధన సిబ్బంది, భవనాలు, మౌలిక సదుపాయాలు లేకుండానే కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ యోగి వేమన వర్సిటీ పరిశోధక విద్యార్థులు అమృత్ మార్, భరత్ సింహా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలుమార్లు వినతులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పిటిషనర్ల ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్