గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎంపిపి ఎన్నికల్లో అత్యధికం కూటమి కైవసం

45 నిమిషాల క్రితం

tdp.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 12:41 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • టిడిపికి 542, జనసేన 41, బిజెపి 7

  • వైసిపి 39, సిపిఎం 1, ఇతరులు 1

ప్రజాశక్తి - యంత్రాంగం : రాష్ర్టవ్యాప్తంగా 659 మండల ప్రజాపరిషత్‌కు నిర్వహించిన ఎంపిపి ఎన్నికకు సంబంధించి 542 స్థానాలు టిడిపి గెలుచుకుంది. వైసిపి 39, జనసేన 41, బిజెపి ఏడు స్థానాలు కైవసం చేసుకుంది. పోలవరం జిల్లా ఎటపాక ఎంపిపి పీఠం సిపిఎంకు దక్కింది. విస్సాపురం నుంచి ఎంపిటిసిగా పోటీ చేసి గెలుపొందిన సోందే రామారావు ఎంపిపిగా ఎన్నికయ్యారు. కడప జిల్లా నందలూరు ఎంపిపి ఇండిపెండెంట్‌ అభ్యర్థి ప్రమీల గెలుపొందారు.

28 మండలాల్లో ఎన్నిక వాయిదా

అనంతపురం జిల్లాలో పామిడి, కల్యాణదుర్గం, శ్రీ సత్యసాయి జిల్లాలో ముదిగుబ్బ, విజయనగరం జిల్లా భోగాపురం మండలం, బాపట్ల జిల్లా బాపట్ల మండలం, తిరుపతి జిల్లాలో వాకాడు, వెంకటగిరి, తొట్టంబేడు, ఓజిలి, నాగాలాపురం, కర్నూలు జిల్లా మంత్రాలయం, నంద్యాల జిల్లా పైడియాల, ఉయ్యలవాడ, కృష్ణా జిల్లా మచిలీపట్నం నార్త్‌, సౌత్‌, నాగాయలంక, కడప జిల్లాలో పులివెందుల రిజర్వేషన్‌తో, బి. కోడూరు, సింహాద్రిపురం, వీరబల్లి, అన్నమయ్య జిల్లాలో ములకలచెరువు, శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, గార, పల్నాడు జిల్లా రొంపిచర్ల, వినుకొండ, కాకినాడలో యు.కొత్తపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ, పోలవరంలో గంగవరం వాయిదా పడింది. వీటికి శుక్రవారం ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఐదు చోట్ల లక్కీ డ్రాలో విజేతల ఎంపిక

కాగా ఐదు మండలాల్లో టిడిపి, వైసిపిలకు సమాన బలాలు రావడంతో అధికారులు నిబంధనల ప్రకారం లక్కీ డ్రా వేశారు. ఈ లక్కీ డ్రాలో నాలుగు చోట్ల టిడిపి గొలుపొందింది. ఒక చోట వైసిపి విజయం సాధించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురంలో టిడిపి అభ్యర్థి పొట్టేళ్ల పార్వతి విజేతగా నిలిచారు. విజయనగరం జిల్లా గుర్లలో ఇరు పార్టీలకు సమాన ఓట్లు రావడంతో లాటరీ తీయగా, టిడిపి అభ్యర్థి సన్యాసినాయుడు ఎంపిపి పీఠాన్ని కైవసం చేసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువులో టిడిపి అభ్యర్థి పిట్టా ఓబులరెడ్డి విజయం సాధించారు. ఎన్‌టిఆర్‌ జిల్లా ఉంగుటూరులో టిడిపి అభ్యర్థిని సుజిత గొలుపొందారు. అనకాపల్లి జిల్లా మునగపాకలో మొత్తం 16 ఎంపిటిసి స్థానాలకు గాను ఇరు పక్షాలకు చెరి ఎనిమిది ఓట్లు రావడంతో లక్కీ డ్రాలో వైసిపి అభ్యర్థి మొల్లేటి శంకర్ గెలుపొంది ఎంపిపి స్థానాన్ని దక్కించుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్