శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్టీల్‌ ప్లాంట్‌లో మరో ప్రమాదం..

2 రోజుల క్రితం

స్టీల్ ప్లాంట్‌లో మరో ప్రమాదం.....

వేడి ఉక్కు ద్రవం మీద పడటంతో కార్మికుని పరిస్థితి విషమం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 08:26 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వేడి ఉక్కు ద్రవం మీద పడటంతో కార్మికుని పరిస్థితి విషమం

ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం): వైజాగ్‌ ‌స్టీల్‌‌ప్లాంట్‌‌లో కాంట్రాక్టు కార్మికునిపై వేడి ద్రవం పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. తోటి కార్మికుల కథనం ప్రకారం... విజయనగరం జిల్లా కొండగంగుపూడి గ్రామానికి చెందిన దుంబరి దేముడు స్టీల్‌‌ప్లాంట్‌‌లోని టిపిపి విభాగంలో పనిచేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 90 శాతం శరీరం కాలి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన తోటి కార్మికులు, ప్లాంట్ అధికారులు వెంటనే నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసియులో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ​స్టీల్ ప్లాంట్‌‌లో ఇటీవల కాలంలో పారిశ్రామిక ప్రమాదాలు పెరగడంపై కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్‌‌లో భద్రతా నిబంధనల అమలు, రక్షణ చర్యల నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్