సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మద్యం టెండర్ల కేసులో నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టివేత

1 గంట క్రితం

tender
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 08, 2026, 12:21 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి : మద్యం రవాణా టెండర్లలో అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ ఖజానాకు రూ.195.33 కోట్ల నష్టం కలిగించారన్న ఆరోపణల కేసులో ముగ్గురు నిందితులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎ-1 దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఎ-3 తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్‌రెడ్డి, ఎ-4 కసిరెడ్డి రాజశేఖర్‌‌రెడ్డి వేర్వేరుగా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను జస్టిస్ గంధం సునీత సోమవారం కొట్టేశారు. జిల్లా స్థాయి రవాణా విధానాన్ని ముందస్తు అనుమతి లేకుండా రద్దు చేసి రాష్ట్రస్థాయి టెండర్ల విధానం తీసుకొచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని కోర్టు పేర్కొంది. బినామీ లావాదేవీలకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలున్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది. రాజకీయ కక్షతో కేసులు నమోదు చేశారన్న నిందితుల వాదనను కూడా కోర్టు తిరస్కరించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్