- పిటిషన్ ను కొట్టివేత
- హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పిటిషన్ పై జస్టిస్ దీపాంకర్ దత్త, షీల్ నాగు ధర్మాసనం విచారణ జరిపారు. సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఎలా పరిగణలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ల పరిమితిని మించారంటూ పేర్కొంది. దీంతో ఏపీ బీసీ రిజర్వేషన్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.







కామెంట్‌లు (0)