అమరావతి : సస్పెన్షన్‌లో ఉన్న ఐపిఎస్ అధికారి ఎన్.సంజయ్‌పై ఎపి ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. గతంలో ఆయన అగ్నిమాపకశాఖ, సిఐడి విభాగాల్లో విధులు నిర్వర్తించారు. సర్వీసు నిబంధనలు, క్రమ శిక్షణ ఉల్లంఘనలపై ప్రభుత్వం రాతపూర్వక వివరణ కోరగా సంజయ్ ఇవ్వలేదు. దీంతో ఆయనపై సాధారణ విచారణ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విచారణాధికారిగా హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్‌ను సిఎస్ సాయిప్రసాద్ నియమించారు. నిర్ణీత గడువులోపు విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గతేడాది జనవరిలో సంజయ్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తన పరిధిలో లేకపోయినా రూ.1.20 కోట్ల వరకు చెల్లింపులు చేసినట్లు ఆయనపై అభియోగాలున్నాయి. ఈ క్రమంలో 8 అంశాలను ప్రస్తావిస్తూ వివరణ ఇవ్వాలని ప్రభుత్వం సంజయ్ ను ఆదేశించింది. ఆయన స్పందించకపోవడంతో విచారణ చేపట్టాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఐపిఎస్ అధికారి సంజయ్ పై ఎపి ప్రభుత్వం క్రమ శిక్షణ చర్యలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 25, 2026, 03:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)