బాపట్ల : జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఎ.జగన్మోహన్ రావు ఆదేశాలతో మంగళవారం మార్టూరు పట్టణంలో వివిధ హోటళ్ళు, రెస్టారెంట్లు, బేకరీలలో అక్రమంగా వాడుతున్న మొత్తం 40 గృహోపయోగ గ్యాస్ సిలిండర్ల ను సీజ్ చేశారు. మొత్తం 20 కమర్షియల్ ఇష్టబ్లిష్మెంట్ ల పై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీలలో మార్టూరు సిఎస్ఆర్ఐ సురేష్, పర్చూరు సిఎస్ఆర్ఐ కిషోర్, చీరాల సిఎస్డిటి ఓంకార్, చుండూరు సిఎస్డిటి గఫూర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్కడైనా హోటళ్లు రెస్టారెంట్లు బేకరీలు టీ స్టాళ్లు తదితర కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల బదులుగా ఇంటిలో వాడే గ్యాస్ సిలిండర్లను వాడిన పక్షంలో వారిపై కేసులు నమోదు చేస్తామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఏ. జగన్మోహన్ రావు తెలిపారు.
అక్రమంగా వాడుతున్న 40 గ్యాస్ సిలిండర్లు సీజ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 25, 2026, 03:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)