అమరావతి : ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ-2025 నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ .... సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. వైసిపి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు విచారించింది. డీఎస్సీ నియామకాల్లో ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని, దీనిపై సిబిఐ దర్యాప్తు చేపట్టాలని పిటిషన్‌లో కోరారు. అయితే, స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగిందని భావించే సంబంధిత అభ్యర్థులే నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది. అభ్యర్థులు భయపడుతున్నారన్న పిటిషనర్ వాదనను కోర్టు అంగీకరించలేదు.
మెగా డీఎస్సీ పై సిబిఐ విచారణకు ఎపి హైకోర్టు నిరాకరణ
04 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 04, 2026, 02:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)