- 6 వారాల్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశం
- బీసీలకు 34% రిజర్వేషన్లపై రెండు జీవోలు కొట్టివేత
అమరావతి: స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు నిచ్చింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 105,1065 జీవోలను హైకోర్టు కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్లు 59 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పుకు ఈ జీవోలు విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన రిజర్వేషన్ పరిమితిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆరు వారాల్లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోర్టు సూచించింది. సర్ ప్రక్రియ ముగిశాకే ఎన్నికలు నిర్వహించాలనే వైసిపి వేసిన పిటిషన్ ను కూడా హైకోర్టు కొట్టివేసింది.








కామెంట్‌లు (0)