ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)-2026 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన ఈ పరీక్ష ఆగస్టు 5 నుంచి 16వ తేది వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో జరిగిన విషయం తెలిసిందే. మొత్తం ఈ పరీక్షకు 2,14,486 మంది అభ్యర్థులు 2,38,252 పేపర్లకు దరఖాస్తు చేసుకోగా, 1,97,703 మంది అభ్యర్థులు 2,18,254 పేపర్లకు పరీక్షలకు హాజరయ్యారని టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఆదివారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. హాజరైన వారిలో 90,862(45.63శాతం) మంది అభ్యర్థులు 99,591 పేపర్లలో ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. వీరిలో 74,711 మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు 84,798 పేపర్లకు టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. 72,288 మంది ఉపాధ్యాయులు 81,127 పేపర్లకు పరీక్షలకు హాజరవ్వగా, 37,789 మంది ఉపాధ్యాయులు 41,315 పేపర్లలో ఉత్తీర్ణత సాధించారని వివరించారు. హాజరైన ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు 50.93 శాతం పేపర్లలో ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. అభ్యర్థులు తమ క్యాండెట్ లాగిన్ తో ఏపి టెట్ అధికారిక వెబ్‌సైట్‌లో https://tet2dsc.apcfss.in, http://cse.ap.gov.in లాగిన్ అయి ఫలితాలు తెలుసుకోవచ్చునని తెలిపారు. 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.
టెట్ ఫలితాలు విడుదల
13 సెప్టెంబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 06:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)