ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: ఎస్‌సి, డిఎన్‌టి విద్యార్థులకు ప్రతిష్టాత్మక ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందించే శ్రేష్ట (శ్రేష్ట నెట్స్) 2027 ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 2027–28 విద్యా సంవత్సరంలో 9, 11వ తరగతుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా 2,400 మందిని ఎంపిక చేయనున్నట్లు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరిలో 2,160 మంది ఎస్‌సి, 240 మంది డిఎన్‌టి విద్యార్థులు ఉంటారని, ఎంపికైన వారి విద్యా ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని, డిసెంబర్ 2 నుంచి 4 వరకు తప్పుల సవరణకు అవకాశం ఉంటుందని తెలిపారు. జనవరి 10, 2027న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారని వెల్లడించారు. అర్హులు https://exams.nta.nic.in/shreshta/ వెబ్‌సైట్‌లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.








కామెంట్‌లు (0)