బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకేసుల మూసివేత ఉత్తర్వుల కాపీల కోసం ఎసిబి కోర్టును ఆశ్రయించండి : హైకోర్టు

2 గంటల క్రితం

ap high court
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 09:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి : మద్యం, ఇసుక విధానాలు, ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులపై నమోదైన కేసుల మూసివేత ఉత్తర్వుల సర్టిఫైడ్‌ కాపీలు, ఇతర దస్త్రాల కోసం ఎసిబి కోర్టులో తగిన దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఈ మేరకు సర్టిఫైడ్‌ కాపీలు, ఇతర పత్రాలిచ్చేందుకు నిరాకరిస్తూ విజయవాడ ఎసిబి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను పరిష్కరించింది. థర్డ్‌ పార్టీలు క్రిమినల్‌ కేసులకు సంబంధించిన సర్టిఫైడ్‌ కాపీలు పొందేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ రూల్స్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌లోని రూల్‌ 212ను సవరించి, 212(ఏ)ను చేర్చిన విషయాన్ని న్యాయస్థానం గుర్తు చేసింది. ఈ నిబంధనల ప్రకారం ఎసిబి కోర్టులో తగిన దరఖాస్తు చేసుకోవచ్చని పిటిషనర్లకు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వై లక్ష్మణరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో మద్యం, ఇసుక విధానాలు, ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు తదితరులపై నమోదైన కేసుల మూసివేత ఉత్తర్వుల సర్టిఫైడ్‌ కాపీలు, ఇతర దస్త్రాలు ఇవ్వాలని కోరుతూ స్వర్ణాంధ్ర తెలుగు డైలీ ఎడిటర్‌ బాలగంగాధర్‌ తిలక్‌, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్