బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅనుమతులు ఉన్నాయా..? లేవా..?

5 గంటల క్రితం

26న కెఆర్‌ఎంబి సమావేశం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 01:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ప్రాజెక్టులు, ఆయకట్టు వివరాలు సమర్పించండి

  • ఎపి, తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కృష్ణా జలాల వివాదం సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టులు, ఆయకట్టు, అనుమతి ఉన్నవి ఎన్ని? లేనివి ఎన్ని? వివరాలు వెంటనే సమర్పించాలని కృష్ణా బోర్డు.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు లేఖ రాసింది. 2021 జులై 15న నీటి పంపకాలకు సంబంధించి ఇచ్చిన నోటిఫికేషన్‌ విషయంలో తెలంగాణ.. సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ జరుగుతోంది. మరోవైపు నీటికి సంబంధించిన అంశాలు రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారుతున్న నేపథ్యంలో కెఆర్‌ఎంబి జోక్యం చేసుకుని అసలు నీటి కేటాయింపుల వివరాలు సమర్పించాలని నోటీసులు జారీ చేసింది. అసలు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, వాటి డిజైన్లను సమర్పించాలని కోరింది. ప్రాజెక్టుల డిజైన్లు, ఆయకట్టు, సిడబ్ల్యుసి అనుమతులకు సంబంధించిన సాంకేతిక వివరాలను ఇవ్వాలని కోరింది. అలాగే అనుమతి లేకుండా కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టారు. ఆయకట్టు ఎంత? నీటి అవసరాలు ఎంత? అనే వివరాలూ ఇవ్వాలని కోరింది. వివరాలు సమర్పించే సమయంలో డిజైన్లకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాలని తెలిపింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ‌ప్రాజెక్టులకు రెండువైపులా ఉన్న కాలువల ద్వారా ఎంత నీరు తీసుకుంటున్నారో చెప్పాలని పేర్కొంది. కొత్తగా కట్టిన ప్రాజెక్టులతోపాటు గతంలో ఉన్న నీటి సరఫరా వ్యవస్థలో మార్పులు చేర్పులు చేసి ఉంటే వాటి వివరాలూ ఇవ్వాలని, అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల రికార్డులు ఇవ్వాలని కోరింది. వీటితోపాటు కొత్త ప్రాజెక్టులు, వాటి నీటి అవసరాలూ వెల్లడించాలని లేఖలో పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్