బుధవారం, 11 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆర్‌ఎస్‌ఎస్‌ ఎత్తుగడలకు ఎదురుదెబ్బ తప్పదు !

53 నిమిషాల క్రితం

ఆర్‌ఎస్‌ఎస్‌ ఎత్తుగడలకు ఎదురు దెబ్బ తప్పదు !
దేశ బహుళత్వాన్ని భవిష్యత్‌ తరాలు పరిరక్షిస్తాయి
తన ఆత్మకథలో మోడీ సర్కార్‌‌పై, ఆర్‌ఎస్‌ఎస్‌‌పై సోనియా విమర్శలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 06:30 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • దేశ బహుళత్వాన్ని భవిష్యత్‌ తరాలు పరిరక్షిస్తాయి

  • తన ఆత్మకథలో మోడీ సర్కార్‌‌పై, ఆర్‌ఎస్‌ఎస్‌‌పై సోనియా విమర్శలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన జ్ఞాపకాల సమాహారం పుస్తకం ‘బిలాంగింగ్‌ : ఎ జర్నీ ఆఫ్‌‌ లవ్‌’ మంగళవారం విడుదలైంది. ఈ పుస్తకాన్ని ప్రచురించాల్సిన ప్రచురణకర్తలు చివరి దశలో మారడానికి ప్రధాన కారణం ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఈ పుస్తక ప్రచురణ సవాలుగా ఎందుకు మారిందంటే, మోడీ ప్రభుత్వంపై, ఆర్‌ఎస్‌ఎస్‌‌పై ముఖ్యంగా పలు కీలక అంశాల్లో వారి వైఖరిపై తీవ్రవమైన విమర్శలు ఈ పుస్తకంలో వున్నాయి. సోషల్‌ ‌మీడియా, డీప్‌ ‌ఫేక్‌ల ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని ఆమె విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ దార్శనికత, తన రాజకీయ దృక్పథం పరస్పర విరుద్ధమని ఆమె వ్యాఖ్యానిం చారు. తమ సైద్ధాంతిక నేపథ్యాలు, భారతదేశం పట్ల అవగాహన వంటి విషయాల్లో ప్రాధమికంగా భిన్నాభిప్రాయాలు వున్నాయన్నారు. ఇలా మోడీ ప్రభుత్వాన్ని తాను విమర్శించిన తీరు పట్ల పెంగ్విన్‌ ‌రాండమ్‌ ‌హౌస్‌ (‌పిఆర్‌‌హెచ్‌) ‌చాలా అసౌకర్యంగా వుందని సోనియా గాంధీ వ్యాఖ్యా నించారు. తన రాత ప్రతిలో కొన్ని మార్పులు చేయాలని, మరికొన్నింటిని తొలగించాలని కోరిన విషయంలో విభేదాలు తలెత్తాయని చెప్పారు. దీంతో చివరిలో ఈ పుస్తకాన్ని హార్పర్‌‌కాలిన్స్‌ ‌సంస్థ ప్రచురించింది. ఈ పుస్తకం ప్రచురించడానికి ముందుగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు చెప్పారు. ఈ పుస్తకంలో చైనా, పుల్వామా, ఆర్‌ఎస్‌ఎస్‌, మోడీ ప్రభుత్వ పనితీరు ఇలా పలు రంగాలకు చెందిన అంశాలపై తీవ్రమైన వ్యాఖ్యలు వున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై, ఆర్‌ఎస్‌ఎస్‌‌పై పదే పదే సోనియా తీవ్రమైన, పదునైనా వ్యాఖ్యలు, విమర్శలు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొమ్మిది కాంగ్రెస్‌, సంకీర్ణ కూటమి ప్రభుత్వాలను అప్రజాస్వామ్య పద్ధతుల్లో బిజెపి కూల్చివేసిందని ఆమె విమర్శిం చారు. యుపిఎ కాలం నాటి దాదాపు 30 కార్యక్రమాలకు ఎన్‌‌డిఎ ప్రభుత్వం వారి పేర్లు పెట్టుకుందన్నారు. పెద్ద నోట్ల రద్దు వంటి చర్యలను విమర్శించారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమిం చడంపై పార్లమెంట్‌‌లో చర్చకు తావివ్వ కుండా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. పుల్వామా దాడి విషయంలో ఇంటెలిజెన్స్‌ ‌వర్గాల హెచ్చరికలపై ప్రభుత్వ స్పందనను ఆమె ప్రశ్నించారు.

బిజెపికి తాను చాలా ఇష్టమైన లక్ష్యాన్ని అని ఆమె పేర్కొన్నారు. తాను ఎదుర్కొన్న దాడుల స్వభావాన్ని ఆమె వివరించారు. ‘‘రోమ్‌ ‌రాజ్‌ అంటే ఏమిటో తెలియకపోయినా దాన్ని తీసుకురావడానికే తాను ఇక్కడకు వచ్చానని’ వారు విమర్శించారు. అంతేనా కేబరే డ్యాన్సర్‌‌నని, మోనికా లెవిన్సీకీనని, గూఢచారినని అనేక విమర్శలు చేశారని ఆమె గుర్తు చేసుకున్నారు. అనేక అధ్యాయాల్లో ఆమె ఆర్‌ఎస్‌ఎస్‌‌పై అనేకసార్లు విమర్శలు చేశారు. దేశ రాజకీయాల్లో నెహ్రూ-గాంధీ కుటుంబం పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వ్యతిరేక వైఖరిని ఎత్తిచూపారు. ‘‘దశాబ్దాల తరబడి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రచార యంత్రం లెక్కకు మించిన పనిగంటలు ఇదే విషయమై పనిచేసింది. ఆ యంత్రాంగం నుండి వెలువడే సమాచారానికి సోషల్‌ ‌మీడియాలో పెద్ద ఎత్తున స్పందన వచ్చేది. ఎఐ సృష్టించినవి, డీప్‌‌ఫేక్‌‌లు ఇవన్నీ కూడా కనిపిం చేవి. వీటితో వారి తప్పుడు వాదనలకు, సమాచా రానికి మరింత విశ్వసనీయత కల్పించడానికి ప్రయత్నాలు జరిగేవి.’’ అని ఆమె పేర్కొన్నారు.

గుత్తాధిపత్యాన్ని చెలాయించడం, ఒకే మతాన్ని, ఒకే భాషను రుద్దడమన్నది ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దీర్ఘకాలిక ప్రణాళిక అని, అయితే అంతిమంగా ఆ ప్రయత్నాలకు ప్రతిఘటన ఎదురవుతుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని సోనియా స్పష్టం చేశారు. రాబోయే తరాలు అణచివేతల వ్యవస్థలను పారద్రోలేందుకు, నిష్పాక్షికత, న్యాయం కోసం పరితపిస్తాయని నేను భావిస్తున్నాను. దానికి కొంత సమయం పడుతుంది. కానీ అంతిమంగా అది జరిగి తీరుతుంది. మన దేశ ఆత్మను పునరుద్ధరించి, దానికి అయిన గాయాలను మాన్పుతారని ఆమె పేర్కొన్నారు. కాగా, చివరిలో లౌకికవాదం, న్యాయం, భారతదేశ బహుళత్వ గుర్తింపులను భవిష్యత్‌ ‌తరాలు కాపాడగలవన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ సోనియా ఈ జ్ఞాపకాల సమాహారాన్ని ముగించారు. అయితే, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఓసారి ప్రధాని కావాలని ఆశపడినట్లు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన ఆత్మకథలో ప్రస్తావించారు. ఈ విషయంపై ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ స్పందిస్తూ. దేశానికి ప్రధాని కావాలనుకోవడం నేరమా? అని ప్రశ్నించారు. తన తండ్రి ఎంతో కష్టపడి, సమర్థంగా పని చేసి పదవులు సంపాదించారని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్