ప్రజాశక్తి - ఒంగోలు : కౌశిక్ మౌలాబీల్ మరణానికి కారకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ‘చలో ఒంగోలు మహా ధర్నా’ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒంగోలులోని పాత మార్కెట్ సెంటర్ వద్ద ర్యాలీగా వస్తున్న ప్రజా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. నేతలను బస్సులో తరలించారు. కౌశిక్ మౌలాబీల్ మరణానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల నాయకులు ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆందోళనకారులు పేర్కొన్నారు.
ఒంగోలు పాత మార్కెట్ సెంటర్‌లో ప్రజా సంఘాల నాయకుల అరెస్టు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 12, 2026, 12:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)