సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సూరత్‌లో వ్యర్థాల కేంద్రంలో ఎగిసిపడిన మంటలు

1 గంట క్రితం

gujarat
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 12:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కమ్ముకున్న దట్టమైన నల్లటి పొగ

సూరత్: గుజరాత్‌లోని సూరత్‌లోని ఖజోడ్ ప్రాంతంలోని వ్యర్థాల కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడ పేరుకుపోయిన మున్సిపల్ వ్యర్థాల భారీ కుప్పలకు మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటలు సమీప ప్రాంతాలకు వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు.






ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్