సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తండ్రి బాధ్యతల్లో రాజ్ నిడిమోరు - క్యూట్ ఫోటో పంచుకున్న సమంత

1 గంట క్రితం

Raj Nidimoru in his role as a father – Samantha shares a cute photo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 12:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : సినీనటి సమంత, దర్శకుడు రాజ్‌ నిడిమోరు దంపతులు తమ తొలి బిడ్డకు స్వాగతం పలికేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లో బేబీ వెల్‌కమ్‌ ఏర్పాట్లను కూడా ప్రారంభించారు. తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పంచుకున్న ఓ ఫొటో ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫొటోలో రాజ్‌ నిడిమోరు తండ్రి బాధ్యతలను ముందుగానే చేపట్టినట్లు కనిపిస్తున్నారు. బేబీ మానిటర్‌ స్టాండ్‌ను స్వయంగా అమర్చుతూ బిజీగా ఉన్నారు. బిడ్డ రాకకు ముందే ఇంట్లో అవసరమైన ఏర్పాట్లను చేసుకుంటున్న రాజ్‌ను చూసి అభిమానులు ఈ ఫొటోపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల సమంత తన వర్కవుట్‌ వీడియోను కూడా సోషల్‌ మీడియాలో పంచుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె 'సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ తమిళం' కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఓవైపు తన వృత్తిపరమైన బాధ్యతలను కొనసాగిస్తూనే.. మరోవైపు బిడ్డ రాక కోసం ఎదురుచూస్తూ ఇంట్లో ఏర్పాట్లలోనూ సమంత, రాజ్‌ నిమగ్నమయ్యారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్