సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో మనోధైర్యం నింపాలి

1 గంట క్రితం

atp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 11:56 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- రాప్తాడు పాఠశాల ఉపాధ్యాయులతో ఆర్జేడీ శామ్యూల్ టెలీకాన్ఫరెన్స్

ప్రజాశక్తి-అనంతపురం(రాప్తాడు): రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై సమీప బంధువు రంపంతో కిరాతకంగా దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో, పాఠశాల ఉపాధ్యాయులకు ఆర్జేడీ శామ్యూల్ ప్రత్యేకంగా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఘటనతో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో నెలకొన్న ఆందోళన, భయాందోళనలను తొలగించి వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు ఆయన కౌన్సెలింగ్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విద్యార్థులు, ఉపాధ్యాయులకు మానసిక ధైర్యాన్ని కల్పించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఆర్జేడీ శామ్యూల్ ఉపాధ్యాయులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఉపాధ్యాయులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని, విద్యార్థులకు భరోసా కల్పిస్తూ వారి మానసిక స్థైర్యాన్ని పెంపొందించాలని సూచించారు. విద్యార్థుల్లో భయాన్ని తొలగించి ప్రశాంతమైన వాతావరణంలో విద్యాబోధన కొనసాగించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్