ముంబయి : బాలీవుడ్ సినీనటుడు షారుక్ ఖాన్ 61 వ పుట్టినరోజును పురస్కరించుకొని ... ముంబయిలో సందడి నెలకొంది. అభిమానులు పెద్ద సంఖ్యలో షారుక్ నివాసం మన్నత్ వద్దకు చేరుకున్నారు. ‘‘ మీ అందరి ప్రేమకు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. నేను కూడా మీ అందర్నీ అంతే ప్రేమిస్తున్నా ’’ అంటూ వారికి షారుక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా ముంబయి బాంద్రా-వర్లీ సీ లింక్ పై షారుక్ ఫొటోను ప్రదర్శించారు. ‘‘ఎప్పుడూ ఈ ప్రేమను అందిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ ఫొటో తీసుకోవడానికి చిన్నగా డ్రైవ్‌కు వెళ్లాల్సి వచ్చింది ’’ అంటూ షారుక్ సరదాగా ఎక్స్ లో రాసుకొచ్చారు. ఇక ఈ అభిమానం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపైకి కూడా చేరింది. ‘వి లవ్ యూ’ అంటూ ప్రత్యేక సందేశాన్ని దీనిపై ప్రదర్శించారు.
Shah Rukh’s 61st Birthday - సీ లింక్, బుర్జ్ ఖలీఫా వద్ద సందడి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 02, 2026, 11:59 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)