సోమవారం, 12 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐలు జాతీయ అధ్యక్షుని నివాసంపై దాడి దారుణం

1 గంట క్రితం

ailu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026, 11:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - తణుకు, తాడేపల్లిగూడెం : ఐలు జాతీయ అధ్యక్షులు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ ఎంపి వికాస్ రంజన్ భట్టాచార్య ఇంటిపై దాడికి నిరసనగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు, తాడేపల్లిగూడెంల్లో న్యాయవాదులు ఐలు ఆధ్వర్యాన సోమవారం నిరసన తెలిపారు. తణుకు బార్ అసోసియేషన్ హాల్ వద్ద చేపట్టిన నిరసనలో ఐలు జిల్లా ఉపాధ్యక్షులు కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన ప్రశ్నించే హక్కును నేడు కాలరాస్తున్నారని, ప్రజాస్వామ్యవాదులపై దాడులు చేస్తున్నారని అన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కామన మునిస్వామి మాట్లాడుతూ న్యాయవాదులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని అరికట్టాలని డిమాండ్‌ ‌చేశారు. సంఘం జిల్లా అధ్యక్షులు పి.వేణుగోపాల్ చౌదరి, నేతలు డిఎన్ఎస్.రవి ప్రసాద్, ఎం.గోపాలరావు మాట్లాడుతూ భావప్రకటన స్వేచ్ఛను కాలరాసే ఇలాంటి దాడులను సహించేది లేదని హెచ్చరించారు. బాధ్యులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్