- యువకుడి మర్మాంగాన్ని కోసేసిన తల్లి
ప్రజాశక్తి - అనంతపురం : తన కూతురిపై అత్యాచారయత్నం చేయబోయిన యువకుడి మర్మాంగాన్ని కోసేసింది ఓ తల్లి. ఈ ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... జిల్లాలోని రాచానుపల్లికి చెందిన సురేష్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. మద్యం మత్తులో డ్రైవర్స్ కాలనీకి చెందిన ఓ మహిళ కుమార్తెపై అత్యాచార యత్నం చేయబోయిన యువకుడిని మహిళ కట్టిపడేసి అతడి మర్మాంగాన్ని కోసేసింది. తీవ్ర రక్తస్రావంతో బాధితుడు కేకలు వేయడంతో స్థానికులు గమనించి అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి మహిళను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.








కామెంట్‌లు (0)