సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బిసి కమిషన్‌ గడువు ఈ నెల 30 వరకు పొడిగింపు

31 ఆగస్టు, 2026

ap govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 11:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల్లో బీసీల వెనుకబాటుతనంపై సమగ్ర, సమకాలీన, శాస్త్రీయ ఆధారాలతో విచారణ చేపడుతున్న డెడికేటెడ్‌ కమిషన్‌ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. కమిషన్‌ పదవీకాలాన్ని 2026 సెప్టెంబర్‌ 30 వరకు పొడిగిస్తూ బీసీ సంక్షేమ శాఖ ఎక్స్‌-అఫీషియో కార్యదర్శి ఎస్‌. సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నేతృత్వంలో ఈ డెడికేటెడ్‌ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా కమిషన్‌ తన చట్టబద్ధమైన విధులు, బాధ్యతలు పూర్తి చేసేందుకు ఆగస్టు 31తో ముగియనున్న కమిషన్‌ ‌గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కమిషన్‌ కార్యదర్శి ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో ఈ డెడికేటెడ్‌ కమిషన్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్