సోమవారం, 02 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మురసు తుపానుపై అప్రమత్తంగా ఉండాలి: అధికారులకు పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

1 గంట క్రితం

pavan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026, 10:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : మురసు తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావం నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తుపాను పరిస్థితులపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాగులు, వంకల సమీపంలో ప్రజలు సంచరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భారీ వర్షాల కారణంగా తాగునీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వీలైనంత త్వరగా పునరుద్ధరించేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తుపాను సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్