- సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కుల, మత తారతమ్యాలకు అతీతంగా సమసమాజ నిర్మాణం కోసం కృషి చేసిన గొప్ప వాగ్గేయకారుడు భక్త కనకదాస అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భక్త కనకదాస జయంతి సందర్భంగా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శుక్రవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కొనియాడారు.
బిఎస్‌ఎఫ్ జవాన్ మృతి పట్ల విచారం
అస్సాంలో భారత్–బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ నదిలో మునిగి మరణించిన రాష్ట్రానికి చెందిన బిఎస్ఎఫ్ జవాన్ కదిమి వేణు మృతి పట్ల సిఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లె గ్రామానికి చెందిన వేణు కేవలం 31 ఏళ్ల వయసులో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేణు మృతి పట్ల డిప్యూటీ సిఎం పవన్‌కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.








కామెంట్‌లు (0)