శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మందులు, వైద్యపరికరాల బిల్లులు పారదర్శకంగా ఉండాలి

1 గంట క్రితం

pav
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 09:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఆరోగ్యశాఖ మంత్రికి ప్రజారోగ్య వేదిక లేఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఆసుపత్రులలో మందులు, వైద్య పరికరాలు, సర్జికల్ వస్తువులు, వినియోగ వస్తువుల ధరలను పారదర్శకంగా ఉండేలా, వివరణాత్మక బిల్లింగ్‌‌పై వెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని ప్రజారోగ్యవేదిక రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ‌యాదవ్‌‌కు వేదిక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి కామేశ్వరరావు, రమణయ్య శనివారం లేఖ రాశారు. ఆసుపత్రి చికిత్స సమయంలో వాడే మందులు, వైద్య పరికరాలు, సర్జికల్ వంటి వస్తువులకు అధిక ధరలు వసూలు చేయడం వల్ల రోగులపై ఆర్ధికభారం పెరుగుతోందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ ఖర్చు ఇప్పటికే లక్షలాది కుటుంబాలకు ఆర్థిక కష్టాలకు ప్రధాన కారణంగా ఉందని పేర్కొన్నారు. ఆసుపత్రులలో చేరిన రోగులు, ముఖ్యంగా సుదీర్ఘ చికిత్స, శస్త్రచికిత్స, క్యాన్సర్ సంరక్షణ ఆసుపత్రి ఫార్మసీలు, నిర్దేశిత సరఫరాదారుల ద్వారా సరఫరా చేయబడే ఈ వస్తువులపై గణనీయమైన వ్యయం భరించాల్సి వస్తోందని తెలిపారు. రోగుల నుండి వసూలు చేసే బిల్లుల్లో తగినంత పారదర్శకత లేకపోవడం వల్ల ధరలను అర్థం చేసుకోవడం కష్టమవుతోందని పేర్కొన్నారు. ఆసుపత్రి బిల్లింగ్‌‌ను పారదర్శకంగా నిర్ధారించడానికి, అన్యాయంగా అధికంగా వసూలు చేస్తున్న చార్జీల నుంచి రోగులను రక్షించడానికి సమగ్రమైన, చట్టబద్ధంగా నిలబడగల యంత్రాంగాన్ని ప్రవేశపెట్టాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్