ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి) నూతన ఛైర్మన్‌గా రిటైర్డు ఐఎఎస్ అధికారి బినోయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ క్యాంపు కార్యాలయంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. బినోయ్ కుమార్‌తో సాయి ప్రసాద్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా బినోయ్ కుమార్‌కు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, జెన్‌కో ఎమ్‌డి ఎస్ నాగలక్ష్మి, ట్రాన్స్‌కో జెఎమ్‌డి సూర్యసాయి ప్రవీణ్ చంద్, ఎపిసిపిడిసిఎల్ సిఎమ్‌డి పి పుల్లారెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపిఇఆర్‌సి సభ్యులు పివిఆర్ రెడ్డి, కార్యదర్శి పి కృష్ణ, నెడ్‌క్యాప్ ఎమ్‌డి కమలాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Print Editionఎపిఇఆర్‌సి ఛైర్మన్‌గా బినోయ్ కుమార్ బాధ్యతల స్వీకరణ
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 05, 2026, 09:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)