- కొత్త పింఛన్లకు డబ్బులు లేవు : అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి - లావేరు : రాష్ట్రంలో 600 మండలాల్లో 560 మండలాలు తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అక్టోబరు ఒకటో తేదీన ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించనుందని వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల విద్యాలయ తాత్కాలిక భవనాలను ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావుతో కలిసి సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపిందన్నారు. కొత్త పింఛన్లకు 16 లక్షల దరఖాస్తులు వచ్చాయని, అందరికీ ఒకేసారి పింఛన్లు ఇవ్వాలంటే డబ్బుల్లేవన్నారు. అర్హులైన వారికి విడతల వారీగా మంజూరు చేస్తామని చెప్పారు. ఇటీవల కేంద్రం రాష్ట్రానికి 2.25 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని, త్వరలోనే ప్రతి నియోజకవర్గానికి పది వేల ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.








కామెంట్‌లు (0)